Centre Revise Coal Stock Norms to Avert Future Crisis | విద్యుత్ సంక్షోభం తప్పించడంపై కేంద్రం చర్యలు

Share this & earn $10
Published at : October 13, 2021

దేశంలోని రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న వేళ........ కేంద్రం కీలక ప్రకటనతో ముందుకు వచ్చింది. దేశంలోని థర్మల్ కేంద్రాలకు......... బొగ్గు సరఫరా పెంచి......, సంక్షోభాన్ని తప్పిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుత కొరతకు కారణాలను సైతం కేంద్రం వివరించింది. ఈ నెల 7న కోల్ ఇండియా...... 1.5 మిలియన్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని.......... దాని వల్ల వినియోగం, సరఫరా మధ్య అగాధం తగ్గిందని కేంద్ర విద్యుత్తుశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న మూడు రోజులపాటు.......... రోజుకు 1.6 మిలియన్ టన్నులు, ఆ తర్వాత..... రోజుకు 1.7 మిలియన్ టన్నులు సరఫరా చేసేందుకు కోల్ ఇండియా....., కేంద్ర బొగ్గు శాఖ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గడానికి 4 కారణాలు ఉన్నట్లు వెల్లడించిన కేంద్రం... డిమాండ్ పెరగడం, భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి, సరఫరాపై ప్రభావం పడడం......, బొగ్గు ధరలు ఎన్నడూ లేనంత పెరిగిపోవడం, విద్యుదుత్పత్తి భారీగా పడిపోవడాన్ని.......... ప్రధాన కారణాలుగా పేర్కొంది. గ్రిడ్ అవసరాలకు తగ్గట్టు....... విద్యుదుత్పత్తి సంస్థలు గరిష్ఠ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అక్టోబర్ 8న మార్గదర్శకాలు జారీచేశామని స్పష్టం చేసింది.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
----------------------------------------------------------------------------------------------------------------------------- Centre Revise Coal Stock Norms to Avert Future Crisis | విద్యుత్ సంక్షోభం తప్పించడంపై కేంద్రం చర్యలు
ETVETV TeluguETV NewsVideo